Manjula: విజయ్ కుమార్ భార్య మంజుల 10 వ వర్ధంతి వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

సీనియర్ నటుడు విజయ్ కుమార్ అందరికీ సుపరిచితమే. తమిళ డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈయన మొదటి భార్య ముత్తుకన్ను గురించి ఎక్కువగా వివరాలు లేవు కానీ రెండో భార్య మంజుల అందరికీ సుపరిచితమే. ఈమె కూడా హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. మంజుల – విజయ్ కుమార్ లకి ముగ్గురు కుమార్తెలు.

వాళ్ళే వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్,శ్రీదేవి విజయ్ కుమార్. అయితే 2013 లో మంజుల గారు (Manjula) అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. నేటితో ఆమె మరణించి 10 ఏళ్ళు కావస్తోంది. అందుకే ఆమె కూతుర్లు ప్రీత, శ్రీదేవి తమ తల్లి 10 వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus