విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినా లాంగ్ రన్ లో భారీ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు రాష్ట్రంలో లియో మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది. అక్కడ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన తొలి సినిమాగా లియో నిలిచింది.
ఈ మార్క్ ను దాటిన ఏకైక సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ కావడంతో అక్కడి సినిమాలు 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు విజయ్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి.
విజయ్ ఒకవైపు తమిళ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు తెలుగు డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ వెంకట్ ప్రభు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. విజయ్ పారితోషికం విషయానికి వస్తే ఒక్కో సినిమాకు 120 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు. విజయ్ టాలీవుడ్ లో మార్కెట్ ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
విజయ్ (Vijay) సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా ఆ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నాయి. విజయ్ భవిష్యత్తు సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్న విజయ్ ఆ సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.