మాస్టర్ మూల కథ ఆధిపత్య పోరేనా..?

  • April 1, 2020 / 02:38 PM IST

దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఖైదీ చిత్రంతో తానేమిటో నిరూపించుకున్నారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా యాక్షన్ అండ్ ఎమోషన్స్ క్యారీ చేస్తూ తెరకెక్కించిన ఖైదీ క్రిటిక్స్ ప్రశంశలతో పాటు, సాధారణ ప్రేక్షకుల మన్నలను అందుకుంది. దీనితో ఆయన తెరకెక్కిస్తున్న మాస్టర్ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్టర్ లో హీరోగా చేస్తున్న తలపతి విజయ్ కూడా బిగిల్ తో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తెలుగు తమిళ భాషలలో ఈ మూవీ విడుదలై భారీ విజయం నమోదు చేసుకుంది.

మాస్టర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కావల్సివుండగా కరోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా పడింది. కాగా మాస్టర్ మూవీలో హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడి పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు బలమైన మాఫియా లీడర్స్ మధ్య జరిగే ఆధిపత్య పోరే మాస్టర్ స్టోరీ అని తెలుస్తుంది.

ఒకే ప్రాంతానికి చెందిన మాఫియా లీడర్స్ అయిన విజయ్ సేతుపతి మరియు విజయ్ మధ్య దీర్ఘకాలిక వివాదం కొనసాగుతుందట. మరి మాఫియా లీడర్ గా ఉన్న విజయ్ మాస్టర్ ఎలా అయ్యాడు అనేది మూవీలో అసలు ట్విస్ట్ అని తెలుస్తుంది. అద్భుతమైన యాక్షన్ మరియు అదిరిపోయే ట్విస్ట్స్ తో మాస్టర్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. మాస్టర్ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా మాళవిక మోహన్ హెరాయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus