Vijay Sethupathi: విజయ్ సేతుపతి అభిమానులు చేసిన ఈ పని గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు కాగా విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. భాషతో సంబంధం లేకుండా విజయ్ సేతుపతి పాపులారిటీని సంపాదించుకున్నారు. సినిమా సినిమాకు విజయ్ సేతుపతికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమోటాల రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయి. కిలో టమాటా 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పలుకుతోంది.

రాబోయే రోజుల్లో టమాటా ధరలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయ్ సేతుపతి అభిమానులు ఎక్కువ మొత్తంలో టమాటాలు కొనుగోలు చేసి ఆ టమాటాలను ఉచితంగా పంపిణీ చేయడం గమనార్హం. విజయ్ సేతుపతి అభిమానులు చేసిన ఈ పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని ఆలందూరు అనే ప్రాంతంలో విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

విజయ్ సేతుపతి ఫ్యాన్స్ సంఘం అధినేత తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. ఉచితంగా టమాటాలు పొందిన మహిళలు విజయ్ సేతుపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ్ సేతుపతికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీలో విజయ్ సేతుపతికి ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. విజయ్ సేతుపతిని అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా రాబోయే రోజుల్లో కూడా విజయ్ సేతుపతికి భారీ విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కథల ఎంపిక విషయంలో, పాత్రల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ సేతుపతి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. విజయ్ సేతుపతి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆఫర్లతో బిజీ కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus