స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గతేడాది వకీల్ సాబ్ సినిమాతో కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ సాధించారు. పవన్ నటించిన భీమ్లా నాయక్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా శివరాత్రి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ సగం పూర్తి కాగా ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాలతో పాటు పవన్ భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. మక్కళ్ సెల్వన్ ఈ సినిమాలో విలన్ గా ఎంపికైనట్టు వస్తున్న వార్తల గురించి తెలిసి పవన్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. గతేడాది విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గానిలిచింది.
విజయ్ సేతుపతి తెలుగుతో పాటు ఇతర భాషల్లో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని సమాచారం. ఈ రీజన్ వల్లే ఈ సినిమాలో ఇతర భాషల నటీనటులకు పెద్దపీట వేస్తున్నారని సమాచారం. గబ్బర్ సింగ్ విడుదలైన పదేళ్ల తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్ సినిమా కావడం గమనార్హం.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ గా కనిపిస్తారని సమాచారం. పవన్ ను ఢీ కొట్టే విలన్ రోల్ లో విజయ్ సేతుపతి కనిపించనున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నారని అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని బోగట్టా. హరీష్ శంకర్ విజయ్ సేతుపతి రోల్ ను వైవిధ్యంగా డిజైన్ చేశారని తెలుస్తోంది.