Vijay Sethupathi: మరోసారి మంచి మనస్సు చాటుకున్న విజయ్ సేతుపతి.. ఏం చేశారంటే?
- August 17, 2024 / 04:00 PM ISTByFilmy Focus
సౌత్ ఇండియాలో విభిన్నమైన పాత్రలతో, సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరవుతున్న ప్రముఖ నటుడు ఎవరనే ప్రశ్నకు ఎలాంటి సందేహం అవసరం లేకుండా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పేరును సమాధానంగా చెప్పవచ్చు. హీరోగా చేసినా విలన్ గా చేసినా స్పెషల్ రోల్ లో నటించినా తన నటనతో ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ సేతుపతి నూటికి నూరు శాతం కష్టపడతారనే సంగతి తెలిసిందే. తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే విజయ్ సేతుపతి తాజాగా సీనియర్ కమెడియన్ తెనాలి కొడుకు విన్నరసన్ ట్యూషన్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాయని తెలియడంతో 76,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మంచి మనస్సును చాటుతున్నారు.
Vijay Sethupathi

ఇకపై కూడా విన్నరపన్ ఫీజును తానే చెల్లిస్తానని చెప్పిన విజయ్ గొప్ప మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. అయితే విజయ్ సేతుపతి ఈ విధంగా ఆర్థిక సహాయాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పలు కుటుంబాలకు ఆయన అండగా నిలిచారు. విజయ్ సేతుపతి నటించిన పలు సినిమాల్లో తెనాలి సైతం నటించారు.

విజయ్ సేతుపతి, తెనాలి మధ్య మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. విజయ్ సేతుపతి చేసిన సహాయాన్ని ఎప్పటికీ మరవలేనని చెబుతూ తెనాలి ఎమోషనల్ అయ్యారు. తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్న విజయ్ సేతుపతి తమిళంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తున్నారు.

రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్న విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ ఏడాది మహారాజ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ సేతుపతి ఈ సినిమాతో అభిమానులను అంచనాలను మించి మెప్పించారు. విజయ్ సేతుపతి తన సక్సెస్ రేట్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.












