Vijay Sethupathi: వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన నటుడు.. గొప్పోడంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో తన విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఒకరు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక్కో మెట్టు పైకి ఎదిగిన విజయ్ సేతుపతి తమిళనాడు రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ట్రైన్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే విజయ్ సేతుపతి ఓటు వేసి వచ్చిన తర్వాత ఒక వృద్ధురాలు తాను విజయ్ సేతుపతికి వీరాభిమానినని అతనితో సెల్ఫీ కావాలని కోరింది.

అభిమానుల ద్వారా ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ సేతుపతి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలి కాళ్లకు నమస్కరించడంతో పాటు సెల్ఫీ దిగారు. వీల్ ఛైర్ లో ఉన్న వృద్ధురాలితో ప్రేమగా విజయ్ సేతుపతి వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. విజయ్ సేతుపతి సింప్లిసిటీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ సేతుపతి తన కోసం మోకాళ్లపై నిలబడి మరీ సెల్ఫీ దిగడంతో వృద్ధురాలు ఎంతో సంతోషించారు.

విజయ్ సేతుపతి కెరీర్ విషయానికి వస్తే ట్రైన్ మూవీ కోసం భారీ రైలు సెట్ ను నిర్మించారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రానుంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించని విజయ్ సేతుపతి కథ నచ్చితే తెలుగులో కూడా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ సేతుపతికి తెలుగులో కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఉండగా రాబోయే రోజుల్లో విజయ్ సేతుపతి కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. రెమ్యునరేషన్ కంటే మంచి రోల్ కే విజయ్ సేతుపతి ప్రాధాన్యత ఇస్తున్నారని భోగట్టా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus