బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వాడే. కానీ తర్వాత కాంట్రోవర్సీల్లో చిక్కుకుని సినిమా అవకాశాలు కోల్పోయాడు. ఇతను ఏం మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడతాడు. తన మాటల్లో పచ్చి నిజం ఉంటుంది. కానీ దాన్ని వెంటనే డైజెస్ట్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కొట్టినట్టు ఉంటుంది. ఏదేమైనా అతను బాలీవుడ్ కి దూరమయ్యాడు.
కొన్నాళ్లుగా సౌత్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నాడు. తమిళ, మలయాళ సినిమాల్లో అతను విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. అనురాగ్ కశ్యప్ తన కూతురి పెళ్లి చేయడానికి చాలా కష్టాలు పడ్డాడట. అలియా పెళ్లి చేయడానికి అనురాగ్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడట. అలాంటి టైంలో అతన్ని విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఆదుకున్నాడట. ఈ విషయాన్ని అనురాగ్ కశ్యప్ ఓ సందర్భంలో వెల్లడించాడు.
అతను ఓ సందర్భంలో మాట్లాడుతూ.. “నా కూతురు ఆలియా కశ్యప్ పెళ్ళికి అవసరమైన డబ్బు నా దగ్గర లేదు. ఈ విషయాన్ని నేను అందరి దగ్గర చెప్పి సాయం అడిగే స్ట్రెంత్ నాకు లేదు. ఓ రోజు విజయ్ సేతుపతికి చెప్పాను. అతనితో నాకు కొంచెం బాండింగ్ ఉంది. అప్పుడు అతను.. ‘మేము సహాయం చేస్తాము’ అని చెప్పాడు. అతను చెప్పినట్టు నాకు ‘మహారాజా’ తో (Maharaja) పాటు పలు సినిమాల్లో విలన్ ఛాన్సులు ఇప్పించి ఆదుకున్నాడు. అతని రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనిది” అంటూ అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు.