పాజిటివ్ రోల్స్ అయినా నెగిటివ్ రోల్స్ అయినా తనదైన శైలిలో నటించి మెప్పించే వారిలో విజయ్ సేతుపతి ఒకరు. ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్రకు ఉండే ప్రదాన్యత ఎంత ఉంది అనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలకు కూడా సరైన న్యాయం చేయగలనని ఇటీవల వచ్చిన మాస్టర్ సినిమాతో క్లారిటీ ఇచ్చేశాడు. రానున్న రోజుల్లో మరిన్ని నెగిటివ్ రోల్స్ లో దర్శనమిచ్చే అవకాశం లేకపోలేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ హీరో తీసుకునే రెమ్యూనరేషన్ పై మరోసారి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మాస్టర్ సినిమాలో అతను చేసిన భవాని పాత్ర క్లిక్కవ్వడం వలన బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ చాలానే వస్తున్నయట. ఇక విజయ్ మాస్టర్ సినిమా కోసం దాదాపు 8కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇక రాబోయే రోజుల్లో విలన్ పాత్రల కోసం 10కోట్లకి పైగా డిమాండ్ చేయడానికి రేడి అయినట్లు సమాచారం.
ప్రస్తుతం అతను విలన్ గా చేసిన ఉప్పెన సినిమా విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను మాస్టర్ కంటే ముందే ఒకే చేశాడు కాబట్టి తక్కువగానే తీసుకున్నాడట. ఒకవేళ ఉప్పెన కూడా హిట్టయితే మరో స్థాయికి వెళ్లినట్లే. అయితే విజయ్ సేతుపతిలో ఉన్న మరో మంచి విషయం ఏమిటంటే లీడ్ రోల్ లో నటించాల్సి వచ్చినప్పుడు కథ అమితంగా నచ్చితే రెమ్యునరేషన్ ను సగం వరకు తగ్గించేస్తాడు. అందుకే విజయ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నాడు.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!