Vijay Sethupathi: విజయ్ సేతుపతి ప్రేమ పెళ్లిలో ఇన్ని ట్విస్టులా?

దక్షిణాది భాషల్లో పాపులారిటీని సంపాదించుకున్న నటులలో విజయ్ సేతుపతి ఒకరనే సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ రావడంతో పాటు విజయ్ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. తన స్వయంకృషితో విజయ్ సేతుపతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటుడిగా సక్సెస్ సాధించారు. తాజాగా ఒక సందర్భంలో విజయ్ సేతుపతి తన ప్రేమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఉప్పెన సినిమా తర్వాత తెలుగులో విజయ్ సేతుపతికి ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే విజయ్ సేతుపతి వివాహం చేసుకున్నారు. 23 సంవత్సరాల వయస్సులోనే విజయ్ సేతుపతి వివాహం జరిగింది. తాను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా జెస్సీతో తనకు పరిచయం ఏర్పడిందని విజయ్ సేతుపతి వెల్లడించారు. ఆ సమయంలో జెస్సీ కూడా దుబాయ్ లోనే ఉందని చాటింగ్ ద్వారా తాను, జెస్సీ ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయ్యామని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని చాలాసార్లు మాట్లాడిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లికి అంగీకరించారని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు.

ఎంగేజ్ మెంట్ సమయంలోనే తాను జెస్సీని తొలిసారి చూశానని విజయ్ వెల్లడించారు. భార్య ప్రోత్సాహంతో సినిమాలలో ఈ స్థాయికి చేరుకున్నానని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్యంగా ఉన్నారు. 2023 వరకు వరుస ఆఫర్లతో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనంత బిజీగా విజయ్ సేతుపతి ఉన్నారని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus