శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళిధరన్ జీవిత కథతో ‘800’ అనే చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.విజయ్ సేతుపతి ఈ బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. 800పైనే వికెట్లు తీసి ప్రపంచ రికార్డుని క్రియేట్ చేసాడు మురళీ ధరన్. ఎంతటి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ .. మురళీ ధరన్ స్పిన్ మాయాజాలానికి పెవిలియన్ కు వెళ్ళిపోయేవాడు. మ్యాచ్ చూస్తున్నంత సేపు ‘మురళీ ధరన్ … స్పెల్ రాకముందే తమ అభిమాన జట్టు విజయం సాధిస్తే బాగుణ్ణు’ అంటూ ప్రేక్షకులు కోరుకునే వారు..
అంటే అతని బౌలింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.అయితే మురళీధరన్ తన బాల్యం నుండీ ఎన్నో ఒడుదుడుకులను, కష్టాలను అనుభవిస్తూ వచ్చాడట. ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకుని.. ఎం.ఎస్.శ్రీపతి.. మురళీ ధరన్ బయోపిక్ ను తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యనే ‘800’ మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే మురళీ ధరన్ లుక్ లో విజయ్ సేతుపతిని చూసిన తమిళ ప్రేక్షకులు.. ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ట్విట్టర్ లో ఇది పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయ్యింది.
శ్రీలంక ప్రభుత్వం తమిళులను … జాతి ఆధారంగా వివక్ష చూపిస్తుంటుందని. ఈ క్రమంలో ఓ శ్రీలంకన్ బయోపిక్ లో నువ్వు నటించడం ఏంటి? సిగ్గు లేదా? అంటూ తమిళ ప్రేక్షకులు విజయ్ సేతుపతిని ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. భారతీ రాజా వంటి దర్శకులు కూడా ఈ బయోపిక్ నుండీ విజయ్ సేతుపతి తప్పుకుంటే మంచిదని సూచించారు. మురళీ ధరన్ సైతం ‘నా పై సినిమా తీయొద్దు’ అంటూ తాజాగా ఓ లేఖను విడుదల చేసాడు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.