Vijay Sethupathi: ఆ పాత్రతో విజయ్ సేతుపతికి సక్సెస్ దక్కుతుందా?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన నటులలో విజయ్ సేతుపతి ఒకరు. విజయ్ సేతుపతి ఏ సినిమాలో నటించినా తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవడంతో పాటు సినిమా సక్సెస్ సాధించేలా జాగ్రత్త వహిస్తారనే సంగతి తెలిసిందే. ఉప్పెన సక్సెస్ తో విజయ్ సేతుపతికి భారీ స్థాయిలో క్రేజ్ పెరిగింది. అయితే ఒక సినిమాలో విజయ్ సేతుపతి సీఎం పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సిద్ధరామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో విజయ్ సేతుపతి ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.

సిద్ధరామయ్య శిష్యులు ఈ బయోపిక్ ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. సిద్ధరామయ్య జీవితంలోని కీలక పాయింట్ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సిద్ధరామయ్య క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచే విధంగా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. అయితే ఈ సినిమాకు సిద్ధరామయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో సిద్ధరామయ్య శిష్యులు ఆయనను కలిసి కథ వినిపించి అనుమతులు తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ పాత్రలో నటించడానికి విజయ్ సేతుపతి సైతం ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2023 సంవత్సరంలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేవలం మూడు నెలల్లో షూట్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని బోగట్టా. అయితే ఈ బయోపిక్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని చాలామంది చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ పాత్రలో విజయ్ సేతుపతికి సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయ్ సేతుపతి సీఎం రోల్ లో కనిపించనున్నారనే వార్త ఫ్యాన్స్ కు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus