Vijay Sethupathi: సుకుమార్ విజయ్ ను అలా చూపించబోతున్నారా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పుష్ప2 సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కథ, కథనంపై సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని సమాచారం అందుతోంది. పుష్ప ది రైజ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలను మించి సక్సెస్ సాధించడంతో ప్రేక్షకుల ఆలోచనలకు భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాల్సిన బాధ్యత సుకుమార్ పై ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం పుష్ప ది రూల్ లో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారని వినిపిస్తోంది. వైరల్ అవుతున్న వార్తలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచాయి. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సేతుపతికి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాధారణ పాత్రను సైతం తన నటనతో మరో లెవెల్ కు తీసుకెళ్లే నటుడిగా విజయ్ సేతుపతికి పేరుంది.

విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కూడా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప2 సినిమాను ఖర్చు విషయంలో రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప2 సినిమాకు అడిషన్స్ కూడా జరుగుతున్నాయి. అడిషన్స్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. పుష్ప2 సినిమాతో అటు సుకుమార్ కెరీర్ లో ఇటు అల్లు అర్జున్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రష్మిక పాత్రకు పుష్ప2 లో ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus