ఆయన వెంటపడుతున్న మెగా హీరోలు

మెగా హీరోల హాట్ ఫేవరెట్ స్టార్ ఐపోయారు విజయ్ సేతుపతి. సైరా చిత్రంతో మొదలైన ఆయన జర్నీ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన సైరాలో ఆయన తమిళ వీరుడిగా కీలకమైన రోల్ చేశారు. ఇక సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మొదటి చిత్రం ఉప్పెనలో కూడా ఆయన ఓ ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ప్రత్యేకంగా నిలువనుందని సమాచారం.

ఐతే మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ బాక్సర్ లో కూడా విజయ్ సేతుపతి ఓ పాత్ర చేసే అవకాశం కలదని సమాచారం. ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఓ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకొచ్చే పనిలో పడ్డారట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదే కనుక జరిగితే విజయ్ సేతుపతి చేసే నాలుగో మెగా హీరో సినిమా అవుతుంది. సెంటిమెంట్ కోసమో, టాలెంటెడ్ ఉండనో తెలియదు కానీ మెగా హీరోలు ఆయన వెంటపడుతున్నారు. ఇక బాక్సర్ చిత్రాన్ని దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్దూ ముద్దా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం కంప్లీట్ మేక్ ఓవర్ అయ్యారు. కండలు పెంచి సిక్స్ ప్యాక్ బాడీ ని సిద్ధం చేశారు. త్వరలో ఈ మూవీ సైట్స్ పైకి వెళ్లనుంది.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus