Vijay Sethupathi: విజయ్ సేతుపతి పరిస్థితి ఇంత దారుణమా?

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన విజయ్ సేతుపతి 96 సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఫిదా అయ్యారు. ఉప్పెన సినిమా సక్సెస్ సాధించడంతో విజయ్ సేతుపతి మరింత బిజీ అవుతారని అందరూ భావించారు. అయితే విజయ్ సేతుపతికి వరుస ఆఫర్లు వస్తున్నా ఆ సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి.

విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కోసం సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం వల్లే ఆయన సినిమాలు ఇలాంటి ఫలితాలను అందుకుంటున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏడాదిలోనే విజయ్ సేతుపతి క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఏప్రిల్ లో విడుదలైన కన్మణి రాంబో ఖతీజా ఏ స్థాయి డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. తాజాగా విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విక్రమ్ మూవీ థియేటర్లలో విడుదలైంది. విక్రమ్ సినిమాలో చొక్కా లేకుండా విజయ్ కనిపించిన సీన్లకు నెగిటివ్ మార్కులు పడుతున్నాయి.

విజయ్ సేతుపతి రొటీన్ పాత్రలకు ఓకే చెబుతూ తన స్థాయిని అతనే తగ్గించుకుంటున్నాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల రాబోయే రోజుల్లో విజయ్ సేతుపతి సినిమాలకు పూర్తిస్థాయిలో దూరం కావాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మక్కన్ సెల్వన్ గా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విజయ్ సేతుపతి ఇకనైనా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో విజయ్ సేతుపతి ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. మరోవైపు విజయ్ రెమ్యునరేషన్ కూడా భారీస్థాయిలో ఉందని ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా విజయ్ సేతుపతి పారితోషికం తీసుకుంటున్నారని బోగట్టా. విజయ్ సేతుపతి రొటీన్ రోల్స్ ను ఎంచుకోవడం వల్ల ఆయన ఫ్యాన్స్ సైతం తీవ్రస్థాయిలో నిరాశకు గురవుతున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus