Vijay Remuneration: చివరి సినిమా కోసం విజయ్ ఆ రేంజ్ లో తీసుకుంటున్నారా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ గతేడాది లియో సినిమాతో సక్సెస్ సాధించగా త్వరలో విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాలతో త్వరలో బిజీ కానున్నారు. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో నటిస్తానని కొత్త సినిమాలను ప్రకటించనని విజయ్ చెప్పుకొచ్చారు. విజయ్ చివరి మూవీ వెట్రిమారన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోందని భోగట్టా. ఈ సినిమాకు విజయ్ పారితోషికం 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. అయితే ఈ మొత్తాన్ని విజయ్ డైరెక్ట్ గా తీసుకోవడం లేదని ఈ సినిమా హక్కులను తీసుకోవడం ద్వారా విజయ్ కు ఆ మొత్తం పారితోషికంగా దక్కనుందని తెలుస్తోంది.

చివరి సినిమా కోసం విజయ్ ఊహించని రేంజ్ లో ఛార్జ్ చేస్తున్నారని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. విజయ్ మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని మరి కొందరు చెబుతుండటం గమనార్హం. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యే విధంగా విజయ్ కెరీర్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది.

విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా విజయ్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం మరో పార్టీకి స్థానం ఉందని విజయ్ పార్టీ తమిళనాడు పాలిటిక్స్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ కు (Vijay) పాలిటిక్స్ ఏ మేరకు కలిసొస్తాయో చూడాల్సి ఉంది. సినిమాల్లో స్టార్ స్టేటస్ అందుకున్న వాళ్లు సైతం రాజకీయాల్లో సక్సెస్ కావడం సులువు కాదు. అభిమానుల నుంచి మాత్రం విజయ్ కు ఊహించని స్థాయిలో సపోర్ట్ దక్కుతోంది. విజయ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus