Varasudu: ‘వారసుడు’ తెలుగు ప్రమోషన్స్ కు విజయ్ డుమ్మా.. దిల్ రాజు కవరింగ్ ఇది..!

‘వారసుడు'(వరిసు) సినిమా విషయంలో జరిగిన ట్రోలింగ్ దిల్ రాజు పై మునుపెన్నడూ జరగలేదు అనే చెప్పాలి. ఈ సినిమా అనౌన్స్మెంట్ దశ నుండి దిల్ రాజు పై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మొదట ఇది బైలింగ్యువల్ మూవీ అని అనౌన్స్ చేశాడు. ‘కానీ ఇది తమిళ్ సినిమా.. తెలుగులో డబ్ అవుతుంది అంతే’ అని బీస్ట్ ప్రమోషన్స్ లో డైరెక్ట్ గా చెప్పాడు దిల్ రాజు. అంతేకాదు.. నిర్మాతలంతా ఓ మాట అనుకుని తెలుగు సినిమాల షూటింగ్లను ఆపేస్తే..

‘వరిసు’ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఇది తమిళ సినిమా అని చెప్పి ఎస్కేప్ అయ్యాడు దిల్ రాజు. సరే ఇవి పక్కన పెట్టేస్తే.. ఇటీవల తమిళ్ లో జరిగిన ‘వరిసు’ ఆడియో రిలీజ్ లో వచ్చీరాని తమిళ్ లో ట్రోలింగ్ కు గురయ్యాడు దిల్ రాజు. ‘ఐ యామ్ వెయిటింగ్ సార్ క్యాబిన్… డోర్ ఓపెన్ ఆయిచ్చు. సార్ ఎంట్రీ విత్ టు కాఫీ కప్స్. టు మీట్ సర్ ఈజ్ గివెన్ ఫస్ట్ టైం కాఫీ..

అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్.. అది ద సార్’ అంటూ దిల్ రాజు అనడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే దిల్ రాజు.. విజయ్ కు అంత బిల్డప్ ఇచ్చినా అతను తెలుగు ప్రమోషన్లకు రాలేదు. ప్రేమతో దిల్ రాజుకి కాఫీ కప్ తెచ్చిన విజయ్ ‘వారసుడు’ ప్రమోషన్స్ కు ఎగ్గొట్టడమేంటి? అంటూ అతని పై సెటైర్లు పడుతున్నాయి. దీనికి దిల్ రాజు స్పందిస్తూ.. ‘ ‘వరిసు’ తమిళ్ లో జనవరి 11న రిలీజ్ కాబోతుంది. అందువల్ల బిజీ షెడ్యూల్ అయిపోయింది.

తెలుగులో జనవరి 14న సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి.. కచ్చితంగా ట్రై చేస్తా’ అంటూ కవర్ చేశాడు. పాపం.. దిల్ రాజుకి వచ్చిన పరిస్థితి భవిష్యత్తులో మరో నిర్మాతకు రాకూడదు అని ఇండస్ట్రీలో కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళ స్టార్ హీరోలు, అక్కడి ప్రేక్షకులు తెలుగు సినీ మేకర్స్ ను ఎంత చులకనగా చూస్తారు అనేది దిల్ రాజుని చూసి అర్థం చేసుకోవచ్చు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus