Vijay Thalapathy: ఆ విషయంలో మాత్రం స్టార్ హీరో విజయ్ ను మెచ్చుకోవాల్సిందే!

ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతారు. ఇతరులకు, పరిచయం లేని వాళ్లకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు, పేదరికం వల్ల చదువుకు దూరమైన వాళ్లకు సహాయం చేయాలంటే ఇంకా మంచి మనస్సు ఉండాలి. అలాంటి మంచి మనస్సుతో సహాయం చేస్తూ లారెన్స్ (Raghava Lawrence) చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) కూడా మంచి మనస్సును చాటుకుంటున్నారు. మరో 40 రోజుల తర్వాత హీరో విజయ్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నారు.

ఆరోజు పది, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విజయ్ బహుమతులు ఇవ్వడంతో పాటు కొంత మొత్తం నగదు అందిస్తారని తెలుస్తోంది. గత పుట్టినరోజుకు విజయ్ ఈ విధంగా చేయడంతో ఈ పుట్టినరోజుకు సైతం అదే విధంగా అదే విధంగా చేయబోతున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో హీరో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కానున్న సంగతి తెలిసిందే.

విద్యార్థులకు సహాయం చేసే విషయంలో మాత్రం స్టార్ హీరో విజయ్ ను మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రెమ్యునరేషన్ 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం. విజయ్ రెండు సినిమాలలో నటించి సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పనున్నారు. విజయ్ సీఎం కావడమే లక్ష్యంగా పొలిటికల్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

అయితే తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితులు విజయ్ కు కలిసొస్తాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయ్ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విజయ్ లుక్స్ విషయంలో కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. విజయ్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. విజయ్ భవిష్యత్తులో సైతం సినిమాలలో కొనసాగాలని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus