Varasudu OTT: ఆ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ ఒక సిద్దమైన వారసుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

విజయ్ దళపతి హీరోగా,రష్మిక మందన్న హీరోయిన్గా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. తమిళంలో వరిసు పేరిట విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేసింది. ఇలా థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తిరిగి ఓటీటీలలో విడుదల కావడానికి సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ లలో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ రెండు ఓటీటీలలో ఈ సినిమా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ప్రసారం కానుంది.తెలుగు తమిళ భాషతో పాటు హిందీ భాషలో కూడా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. మరోవైపు ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీ తమిళంలో ఈ సినిమా విడుదల కాగా తెలుగులో మాత్రం 14వ తేదీ విడుదలైంది.ఇలా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో మంచి సక్సెస్ అందుకుంది. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.

ఇలా ఎన్నో వివాదాలు నడుమ విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో కలిపి సుమారు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు సమాచారం. ఈ సినిమా డిజిటల్ మీడియాలో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus