ప్రముఖ లెజండరీ సింగర్ అయిన కె.జె.ఏసుదాస్ కొడుకు, మరియు టాప్ సింగర్లలో ఒకడైన విజయ్ ఏసుదాస్.. కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడం సంచలనంగా మారింది. సోమవారం రాత్రి ఆయన కేరళలోని అలప్పుళలో ప్రయాణిస్తోన్న సందర్భంలో అటు వైపు నుండీ వస్తోన్న మరో కారు ఢీ కొట్టగా ఈ ప్రమాదం చోటుచేసుకుందట. అయితే తృటి లో ఘోర ప్రమాదం తప్పిందని.. ఎవ్వరికీ ఏం కాకుండా అంతా క్షేమంగానే ఉన్నారని అక్కడి స్థానికులు చెప్పుకొచ్చారు.
‘విజయ్ కొచ్చి నుండీ తిరువనంతపురం ప్రయాణిస్తుండగా’ ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో విజయ్ కారు.. ముందు భాగం కాస్త డ్యామేజ్ అయ్యిందట.’నేను క్షేమంగానే ఉన్నాను..కంగారు పడాల్సింది ఏమీ లేదు’ అంటూ విజయ్ ఏసుదాస్ చెప్పుకొచ్చాడు. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ లో ‘నువ్వంటే ప్రాణమని’, ‘లెజెండ్’ సినిమాలో ‘నీ కంటి చూపుల్లోకి’, ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాలో ‘బావగారి చూపే’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లో ‘నింగి చుట్టె’ వంటి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడాడు విజయ్ ఏసుదాస్.
ఈ మధ్య కాలంలో ‘నింగి చుట్టె’ పాట ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటతో విజయ్ ఏసుదాస్ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.