Vijayashanthi: ఆ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి!

దాదాపుగా రెండు దశాబ్దాల క్రితం విజయశాంతి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్ గా విజయశాంతి టాలీవుడ్ లో గుర్తింపును తెచ్చుకున్నారు. 180కు పైగా సినిమాల్లో తెలుగుతో పాటు ఇతర భాషలలో విజయశాంతి నటించారు. సౌత్ ఇండియాలో లేడీ అమితాబ్ గా, లేడీ సూపర్ స్టార్ గా విజయశాంతి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. విజయశాంతి ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

విజయశాంతి హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ను తీసుకొని గతంలో వార్తల్లో నిలిచారు. కర్తవ్యం సినిమా కోసం విజయశాంతి ఏకంగా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. అప్పట్లో ఏ హీరోయిన్ తీసుకోని స్థాయిలో విజయశాంతి రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు. 1998 సంవత్సరంలో విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి మరో సక్సెస్ ను సాధించారు. అయితే విజయశాంతికి చిరంజీవి, బాలకృష్ణతో విభేదాలు ఉన్నాయని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.

చిరంజీవి, బాలకృష్ణకు జోడీగా విజయశాంతి పదుల సంఖ్యలో సినిమాలలో నటించారు. బాలయ్య విజయశాంతి కాంబోలో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గుర్తింపు వచ్చిన తర్వాత విజయశాంతి చిరంజీవి, బాలయ్యతో కలిసి నటించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ నిప్పురవ్వ సినిమా తర్వాత తన పారితోషికం భారీగా పెరిగిందని అన్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకోవడంతో బడ్జెట్ సమస్యలు వస్తాయని భావించి మెగాస్టార్, బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేయలేదని విజయశాంతి వెల్లడించారు.

విజయశాంతి క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లు ఇకపై ఆగుతాయేమో చూడాల్సి ఉంది. విజయశాంతికి ఎక్కువ సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నా ఆమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. విజయశాంతికి ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus