Vijayashanti: ఎన్టీఆర్ మూవీలో విజయశాంతి.. కొరటాలకు వర్కౌట్ అవుతుందా..!

లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి.. చాలా కాలం నుండీ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను ఈమె పోషించింది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఈమె వరుస సినిమాల్లో నటిస్తుందని అంతా భావించారు. కొంతమంది దర్శకులైతే ఈమెను దృష్టిలో పెట్టుకుని పాత్రలు డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ లిస్ట్ లో కొరటాల శివ పేరు ప్రధానంగా వినిపిస్తుంది.

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో విజయశాంతి.. మెగాస్టార్ చిరంజీవిని మీ సినిమాలో నటించాలా? అంటూ అడిగారు. దీంతో కొరటాల.. విజయశాంతి కోసం తన సినిమాలో ఓ పాత్రను డిజైన్ చేయాలని భావించాడు. బన్నీతో అనుకున్న ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది.దీంతో ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్ తో అతను సినిమా చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర ఉంటుందట. దాని కోసం కొరటాల.. విజయశాంతిని సంప్రదిస్తున్నట్టు వినికిడి.

కానీ ఆమె ప్రస్తుతానికి ఏ సినిమాలోనూ నటించడానికి సిద్ధంగా లేదని చెబుతుందట. అయినప్పటికీ కొరటాల తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అనిల్ రావిపూడి 2016 ‘రాజా ది గ్రేట్’ టైం నుండీ విజయశాంతిని బ్రతిమిలాడుతుంటే 2019 కి ఆమె ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ఒప్పుకుంది. మరి కొరటాలకు అంత ఓపిక ఉంటుందా..? ఈమె ఒప్పుకోకపోతే వరలక్ష్మీ శరత్ కుమార్ తో ఆ పాత్ర చేయించాలనే ఆలోచన కూడా కొరటాలకు ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి.. ఫైనల్ గా ఏం జరుగుతుందో?

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus