2005 సంవత్సరం తర్వాత ప్రముఖ నటి విజయశాంతి సినిమాలకు దూరమయ్యారు. వరుసగా సినిమాలలో ఆఫర్లు వస్తున్నా విజయశాంతి మాత్రం సినిమాలకు దూరంగానే ఉన్నారు. అయితే 2020 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి ఒక ప్రత్యేక పాత్రలో మెరిశారు. సరిలేరు నీకెవ్వరు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి విజయశాంతి కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయశాంతి మాట్లాడుతూ తాను 1998 సంవత్సరంలో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
ఆ సమయంలో ఉద్యమం ఉండటంతో సినిమాలు చేయలేదని ఆమె తెలిపారు. నా వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని తాను సినిమాలకు దూరమయ్యానని ఆమె వెల్లడించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా సమయంలో తనకు గ్యాప్ దొరికిందని సబ్జెక్ట్ నచ్చిందని పాత్ర డిగ్నిఫైడ్ గా ఉందని ఆమె అన్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పాత్ర బాగుంటుందని అనిపించి ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథ కాబట్టి ఆ సినిమా చేస్తానని తాను చెప్పానని ఆమె వెల్లడించారు.
భర్తతో మాట్లాడి ఆయనను ఒప్పించి సరిలేరు నీకెవ్వరు సినిమా చేశానని విజయశాంతి అన్నారు. డిగ్నిఫైడ్ గా రోల్స్ లేవని కొన్ని సినిమాలకు నో చెప్పానని ఆమె పేర్కొన్నారు. కొత్తదనం ఉన్న కథలకు మాత్రమే ఓటేయాలని తాను అనుకున్నానని ఆమె తెలిపారు. మహేష్ హీరో కావడం అనిల్ డైరెక్టర్ కావడంతో ఆ సినిమాలో నటించడానికి చాలా కంఫర్టబుల్ గా వాళ్లు చూసుకున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు. షాట్ అయ్యాక ఇప్పుడు క్యారవాన్ లోకి వెళుతున్నారని
అప్పట్లో చెట్టుకింద కూర్చొని భోజనం చేసేవాళ్లమని అమె అన్నారు. క్యారవాన్ లో ఎక్కువ సమయం ఉండాలంటే గుహలో ఉన్నట్టు తనకు అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. తాను సరిలేరు నీకెవ్వరు సినిమాను సరదాగా చేశానని అంతే తప్ప వరుసగా సినిమాల్లో చేయనని ఆమె అన్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!