2006 లో వచ్చిన ‘నాయుడమ్మ’ చిత్రం తర్వాత.. 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత విజయశాంతి గారు నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసాడు. ఇక ఈ చిత్రంలో విజయశాంతి భారతి అనే పాత్రలో కనిపించబోతుంది. ఈమె పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. ఈమె నటించడం వల్ల ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.
ఇక ఈమె ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తుంది అని తెలుసుకున్న మిగిలిన దర్శకనిర్మాతలు.. విజయశాంతి ఉంటే.. తమ సినిమాలకి కూడా అడ్వాంటేజ్ అవుతుందని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయితే.. విజయశాంతి గారు.. దర్శక నిర్మాతలకి రెండు షరతులు పెడుతున్నారట.ఒకటి తల్లి పాత్రలు, అతిధి పాత్రలు చెయ్యదంట. రెండోది భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయితేనే.. కథ వినిపించడానికి రావాలని రెండో షరతు అట. వీటితో దర్శక నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట.