Mahesh, Rajamouli: ఆ విషయంలో అనుమానం అక్కర్లేదన్న విజయేంద్ర ప్రసాద్.. ఏం చెప్పారంటే?

మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. హనుమాన్ స్పూర్తితో మహేష్ రోల్ ఉంటుందని ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలు కొంతమంది ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తే మరి కొందరు ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేశాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించి విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చందమామ కథలు, అమరచిత్ర కథలు, మహా భారతం, రామాయణం నుంచి రాజమౌళి స్పూర్తి పొందుతాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

చెడుపై మంచి విజయం సాధించడాన్ని చెప్పాలని రాజమౌళి భావిస్తాడని ఆయన కామెంట్లు చేశారు. సాహసోపేతమైన కథలను తెరపై చూపించడానికి జక్కన్న ఇష్టపడతారని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. భారతీయ సంస్కృతికి అనుగుణంగా జక్కన్న సినిమాలు ఉంటాయని మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా అదే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు. మహేష్ రోల్ హనుమాన్ స్పూర్తితో ఉండనుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.

మహేష్ (Mahesh) రోల్ కు ఏ పౌరాణిక పాత్ర రెఫరెన్స్ కాదని వైరల్ అయిన వార్త ఎవరో కావాలని పుట్టించిన వార్త అని విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా మహేష్ జక్కన్న కాంబో మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉండగా ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా రికార్డులు బ్రేక్ అవుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమా సంచలనాలను సృష్టించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus