టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి ఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే అలాంటి రాజమౌళి తీసే సినిమాలకు కధలు అందించే విజయేంద్ర ప్రసాద్ మంచి కధా రచయితగా అనేక మన్నలను అందుకుంటున్నాడు. అయితే అదే క్రమంలో ఈ రచయిత వివాదాల్లో కూడా ఉంటూ వస్తున్నాడు.
ఒక పక్క మన విజయేంద్ర ప్రసాద్ వయసు పెరిగే కొద్దీ పెన్ను పదునెక్కుతుంది అన్న ప్రశంసలు వస్తున్న క్రమంలోనే, ఆయన రాస్తున్న కధల వల్ల ఆయన చెక్కులో ఇరుక్కుంటాడు ఏమో అన్న భయం సైతం ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే…గత ఏడాది ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలందించి దేశవ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్న ఈయన ప్రస్తుతం ‘బాహుబలి-2’ తో పాటు కన్నడలో ‘వల్లి’ అనే ఓ ఆశక్తికర సైన్స్ ఫిక్షన్ సినిమాకు స్క్రిప్ట్ రచించడమే కాకుండా, త్వరలోనే హిందీలో ఒక సెన్సేషనల్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఏంటి ఆ కధ అంటే…అత్యంత వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతూ ఉండడంతో ఆ సినిమాకు కధ రాసెందుకు మన రచయిత సిద్దం అయ్యాడని సమాచారం. ఇక మరో పక్క ఈ సినిమాను ఉడ్తా పంజాబ్’ చిత్రం విషయంలో వివాదాల్లో చిక్కుకున్న సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రహ్లాద్ నిహ్లాని నిర్మస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, మొత్తానికి మన విజయేంద్ర ప్రసాద్ పెద్ద సాహసమే చేస్తున్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.