విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు కథలు రాస్తుంటారు.. ఇది చాలా పాత విషయం. ఇప్పటివాళ్లకు అయితే ఆయన రాజమౌళి సినిమాలకే కథలు రాస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన నుండి చాలా సినిమాలు వచ్చినా.. రాజమౌళి సినిమా కథా రచయితగానే ఆయనకు ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర నుండి బయటపడాలనో లేక సాధారణంగానే తెలియదు కానీ ఆయన ఇటీవల కాలంలో ఇతర దర్శకులకు వరుస కథలు ఇస్తున్నారు. తాజాగా ‘బ్రహ్మపుత్ర’ పేరుతో నవలను సిద్ధం చేశారు.
17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కథను ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. గూఢచర్య కాల్పనిక రచయిత అయిన నేవల్ ఆఫీసర్ కుల్‌ప్రీత్ యాదవ్‌తో కలసి విజయేంద్ర ప్రసాద్ ఈ నవల కోసం పనిచేస్తున్నారు. హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా ఈ నవలను మే 30న విడుదల చేస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన కవర్ ఇమేజ్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అస్సాంలోని అహోం రాజ్యంలో లచిత్ బోర్ఫుకాన్ జనరల్‌గా చేసేవారు. 1671 సరైఘాట్ యుద్ధంలో నాయకత్వ పటిమతో గుర్తింపు పొందారు. మొఘలులను చాలాసార్లు ఓడించిన లచిత్ వారి నుండి గౌహతిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ కథ యాక్షన్, రొమాన్స్ కూడా ఉంటాయి. అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె యువరాణి పద్మినితో లచిత్ ప్రేమలో పడతారు. వీరి గురించి తెలుసుకున్న రాజు లచిత్‌ని రాజధాని జోర్హాట్ నుండి పంపించేస్తాడు.
కొన్ని రోజుల తర్వాత అహోం రాజధానిపై ఔరంగజేబు దళాలు దాడి చేస్తాయి. అలా రాజ్యంలో కొంత భాగాన్ని మొఘలులకు అప్పగిస్తాడు రాజు స్వర్గ దేవ్. అయితే మొఘలుల వల్ల ప్రమాదంలో పడుతున్న రాజధాని నగరాన్ని ఆ రాజ్యం యువరాజు చక్రధ్వజ్‌తో కలసి లచిత్ రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ యుద్ధంతో అహోం భవిష్యత్తును ఎలా మార్చాడు అనే నవల ప్రధాన కథ అట. ‘
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!