ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా గుర్తింపును సంపాదించుకుని విజయాలను సొంతం చేసుకుంటున్న రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సింహాద్రి తర్వాత తనకు క్రేజ్ పెరగడానికి కారణం దర్శకుడు రాజమౌళి అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
రచయితగా మన ఊహకు 100 మార్కులు వేసుకుంటే ఆ ఊహను రాజమౌళి 130 మార్కులకు తీసుకెళతాడని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజమౌళి సినిమాలో తన ఊహకు దగ్గరగా ఉండే సన్నివేశాలు ఎక్కువగా ఉండవని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎన్టీఆర్ కోసం తాను సింహాద్రి కథను సిద్ధం చేయలేదని కథ రాసుకున్న తర్వాత బాలకృష్ణకు చెప్పగా ఆయనకు ఎందుకో నచ్చలేదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
చెన్నైలో అసోసియేట్ గణేష్ తో కలిసి సినిమా చూసి శ్రీదేవి వదిలి వెళ్లిపోతే కమల్ కు గుండెల్లో గుచ్చినట్టు మనకు ఫీలింగ్ ఉంది కదా అని తాను అన్నానని ఆ తర్వాత తాను అదే సీన్ ను ఇంటర్వెల్ చేసి కొత్త కథ రాద్దామని చెప్పానని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆ తర్వాత గణేష్ శ్రీదేవి నిజంగానే గుండెల్లో గునపంతో గుచ్చాలని వారం రోజులు చెప్పడంతో అతని పోరు భరించలేక ఆ సీన్ రాశానని ఆ తరువాత ముందూ వెనుక జరిగిన కథ రాయడంతో సింహాద్రి సినిమా పుట్టిందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!