Bro Movie: విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విధంగానే సముద్రఖని బ్రో సినిమా తీశాడా?

కొన్నిసార్లు మనకు తెలిసి చెప్తామో.. తెలియక చెప్తామో తెలియదు కానీ మనం చెప్పిన మాటలు తూచా తప్పకుండా అలాగే జరుగుతూ వస్తూ ఉంటాయి. అయితే ప్రెసెంట్ అలా ఇండస్ట్రీలో స్టార్ రైటర్ గా పేరు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు .. హీరో పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతూ ఉండడం అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రైటర్ విజయేంద్ర ప్రసాద్..

రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు కథను ఆయనే అందిస్తాడు. అందువల్లనే రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా సినీ ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొడతాయి అనే నమ్మకం జనాల్లో ఉంది . గతంలో విజయేంద్రప్రసాద్ ఆలీతో సరదాగా షో కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగా విజయేంద్రప్రసాద్ చెప్పిన ఆన్సర్స్ అప్పట్లో హైలైట్ గా మారాయి .

పవన్ కళ్యాణ్ కోసమైతే మీరు ఎలాంటి కధ రాసుకుంటారు ..? అని ఆలీ ప్రశ్నించగా విజయంద్ర ప్రసాద్ సమాధానం ఇస్తూ ..”ఆయన కోసం సపరేట్ కథ రాసుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన సినిమాలో నటించిన పలు సీన్స్ ని పాటలను క్రాప్ చేసి ఓ సినిమాగా తెరకెక్కించేయచ్చు.. కచ్చితంగా ఆయనను చూడడానికి జనాలు థియేటర్స్ కి వస్తారు .ఆ సినిమా హిట్ అవుతుంది ” అంటూ చెప్పుకొచ్చాడు . ఇదే క్రమంలో రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో కూడా సేమ్ టు సేమ్ అలాగే చేశారు.

పవన్ కళ్యాణ్ తో ఒక ఫైట్ లేదు ..ఒక రొమాంటిక్ సీన్ లేదు.. ఒక నాటీ డైలాగ్ లేదు కానీ ఆయన గతంలో నటించిన సినిమాలకు సంబంధించిన పాటలతోనే సముద్రఖని ఈ సినిమాని హిట్ చేసేసారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే 75 కోట్లు కలెక్ట్ చేసేసింది. కాగా ఆ ఇంటర్వ్యూలో విజయంద్రప్రసాద్ మాట్లాడుతూ..” డైనమైట్ ను పేల్చడానికి చిన్న అగ్గిపుల్ల చాలు ” అంటూ విజయేంద్రప్రసాద్ చాలా పవర్ఫుల్ ఆన్సర్ ఇచ్చారు. సరిగ్గా బ్రో సినిమా (Bro Movie) విషయంలో కూడా అదే జరిగిందంటూ నెట్టింట ఈ వీడియోని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus