పవన్ తో విజయేంద్రప్రసాద్ ప్లాన్!
- February 22, 2021 / 07:52 AM ISTByFilmy Focus
దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు భారీ విజయాలు అందుకోవడంలో కథలు ఎంత కీలకపాత్రను పోషిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కథలు రాసేది మరెవరో కాదు.. రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్. ఈయన కథలే రాజమౌళి బలం. కేవలం రాజమౌళి కోసమే కాకుండా.. ఇతర దర్శకులు, హీరోలు కోసం కూడా విజయేంద్రప్రసాద్ కథలు రాస్తుంటారు. ఇప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఓ కథను రాస్తున్నట్లు తెలుస్తోంది. విజయేంద్రప్రసాద్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.
గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ‘బాహుబలి’ సినిమా ఇంటర్వెల్ సీన్ కి.. పవన్ కళ్యాణ్ నే స్ఫూర్తిగా తీసుకున్నానని మీడియా ముందు చెప్పారు విజయేంద్రప్రసాద్. ఇప్పుడు ఆయన పవన్ కోసం కథ రాస్తుండడం విశేషం మరి ఈ కథను మరో దర్శకుడికి ఇచ్చేస్తారా..? లేక రాజమౌళి కోసం పక్కన పెడతారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేసినా.. చేయకపోయినా.. విజయేంద్రప్రసాద్ కథలో పవన్ కళ్యాణ్ హీరో అంటే ఆ క్రేజే వేరు.

మరి పవన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నారో చూడాలి. ప్రస్తుతం పవన్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమాను పూర్తి చేసిన పవన్.. ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలానే క్రిష్ సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాల తరువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు లైన్ లో ఉన్నారు.
Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

















