Pawan Kalyan: మరో భారీ సినిమా పట్టాలెక్కుతుందా..?
- July 2, 2021 / 04:17 PM ISTByFilmy Focus
ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ భారీ బడ్జెట్ సినిమాలకు కథలను అందిస్తూ బిజీగా ఉంటున్నారు. హిందీలో ‘సీత’ అనే సినిమాతో పాటు కోలీవుడ్ లో ‘తలైవి’ సినిమాకి కథలను అందిస్తున్నారు. తన కొడుకు రాజమౌళి సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోలకు కూడా స్క్రిప్ట్ లను రాస్తుంటాడు. రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా కథ సిద్ధం చేశాడు విజయేంద్రప్రసాద్. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్రప్రసాద్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడట.
పవన్ అంటే విజయేంద్రప్రసాద్ కి చాలా ఇష్టం. వ్యక్తిగతంగా కూడా ఆయన్ని అభిమానిస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా పవన్ ను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ స్టార్ ఎవరూ లేరని.. కథ, డైరెక్షన్ వీటి కోసం కాకుండా కేవలం ఆయన్ని చూడడానికి మాత్రమే జనాలు థియేటర్లకు వస్తుంటారని చెప్పాడు. ఇప్పుడు పవన్ కి తగ్గ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసిన విజియేంద్రప్రసాద్ ఆయన్ని కలిసి వినిపించారట.

పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతమైతే పవన్ చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. అయ్యప్పన్ రీమేక్ తో పాటు ‘హరిహర వీరమల్లు’ సినిమాల్లో నటిస్తున్నాడు. అలానే తన తదుపరి సినిమా హరీష్ శంకర్ తో చేయనున్నాడు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

















