బాక్సాఫీస్ దగ్గర విజయ్ పవర్..!

  • January 15, 2021 / 06:55 PM IST

ఇళయదళపతి విజయ్ కి తమిళంలో ఫుల్ క్రేజ్. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం దుమ్మురేపేస్తాడు. అయితే, ఈసారి తెలుగులో కూడా విజయ్ తన పవర్ ని చూపించాడు. సంక్రాంతి పండగని టార్గెట్ చేస్తూ వచ్చిన విజయ్ మాస్టర్ సినిమా మిక్స్ డ్ టాక్ ని అందుకుంది. కొన్ని ఏరియాల్లో అయితే పరమ బోరింగ్ సినిమా అంటూ కూడా టాక్ వచ్చింది. కానీ, వసూళ్ల పరంగా మాత్రం రెచ్చిపోతున్నాడు విజయ్. లాస్ట్ టైమ్ తన ప్రీవియస్ సినిమా విజిల్ కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తూ ట్రేడ్ పండితులని ఆశ్చర్యపరుస్తోంది ఈ సినిమా.

దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ట్రైలర్ చూసిన ప్రేక్షకులు పక్కా మాస్ సినిమా, కాలేజ్ గొడవలు, విజయ్ యాక్టింగ్, ఖైదీ సినిమా తీసిన డైరెక్టర్ ఇవన్నీ కూడా సినిమా ఓపెనింగ్స్ కి కారణం అవుతున్నాయి. థియేటర్స్ దగ్గర క్రౌడ్ జామ్ అవుతున్నారు. అంతేకాదు, తెలుగులో ఒక పెద్ద హీరోకి వచ్చిన రెస్పాన్స్ ఈ సినిమాకి రావడం విశేషం. అందుకే, కలక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఇక విజయ్ సేతుపతికి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉండటం వల్ల కూడా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయనే చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికే ఈ సినిమా 80శాతం రికవరీ చేసేసింది. ఫస్ట్ డే ఈ సినిమా 5.74కోట్లు షేర్ ని వసూల్ చేస్తే, రెండోరోజు ఈ సినిమా దాదాపుగా 1.62 కోట్ల షేర్ ని సాధించింది. మొత్తానికి రెండురోజుల్లోనే 7.36 కోట్లు కలెక్ట్ చేసి మాస్టర్ కలక్షన్స్ దుమ్ముదులిపేశాడు. ఇంకా వీకండ్ కూడా సినిమా ఆడే అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో సినిమా లాభాల బాట పట్టేలాగానే కనిపిస్తోంది. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కలక్షన్స్ పరంగా మాత్రం హిట్ అయ్యాడు మాస్టర్. అదీ విషయం.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus