ఇళయదళపతి విజయ్.. రజినీ కాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరో. ఇప్పుడు రజినీకి పెద్దగా హిట్లు పడటం లేదు కాబట్టి.. అక్కడ ఈయనదే ఎక్కువ హవా అని చెప్పాలి. వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ ఇప్పుడు తన తెలుగు మార్కెట్ ను కూడా పెంచుకునే పనిలో పడ్డాడు. గతంలో విజయ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ‘తుపాకీ’ ‘జిల్లా’ ‘పోలీసోడు’ వంటి చిత్రాలతో కొంతవరకూ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇక అటుతరువాత ‘అదిరింది’ చిత్రంతో మొదటి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ చిత్రాన్ని 5.5 కోట్లకు తెలుగులో కొనుగోలు చేయగా.. అంత మొత్తాన్ని రాబట్టి హిట్ గా నిలిచింది. అటు తరువాత ‘సర్కార్’ చిత్రాన్ని 7.5 కోట్లకు కొనుగోలు చెయ్యగా 9 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇక గతేడాది విడుదలైన ‘విజిల్’ ను కూడా 10 కోట్ల పెట్టి కొనుగోలు చేయగా 11 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇలా డబుల్ డిజిట్ కు చేరుకున్న విజయ్ తన తరువాతి చిత్రం ‘మాస్టర్’ ను కూడా 11 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. అప్పుడే తెలుగు వెర్షన్ కు సంబందించిన బిజినెస్ పూర్తయిపోయిందట. ‘ఖైదీ'(తమిళ్) దర్శకుడు లోకేష్ కనగరాజన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఇంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!