Vijay: మొన్న ప్రభాస్.. ఇప్పుడు విజయ్!

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఏ హీరోకి వంద కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ‘బాహుబలి’ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కి మాత్రం ఇంత మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తన ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి కూడా అదే రేంజ్ లో ఇస్తున్నట్లు సమాచారం. నిజానికి టాలీవుడ్ తో పోలిస్తే కోలీవుడ్ హీరోల రెమ్యునరేషన్లు చాలా ఎక్కువ.

అజిత్, విజయ్ లాంటి హీరోలు ఒక్కో సినిమాకి అరవై నుండి ఎనభై కోట్ల వరకు తీసుకుంటారు. నిర్మాతలు కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి వెనుకాడరు. ఇప్పుడు విజయ్ తన కొత్త సినిమాకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విజయ్ తన తదుపరి సినిమా తెలుగులో చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఈ సినిమాకి గాను విజయ్ కి వంద కోట్లు పారితోషికంగా ఇవ్వడానికి దిల్ రాజు రెడీ అయ్యారట. ఇప్పటికే పదికోట్లను అడ్వాన్స్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మరోపక్క దర్శకుడు వంశీ నటీనటులను, టెక్నీషియన్స్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus