కొడుకులంటే తండ్రులకి విశేషమైన ప్రేమ, అభిమానం ఉండడంలో ఎటువంటి తప్పులేదు. కానీ.. అదే కొడుకు తప్పు చేస్తే శిక్షించి, దండించి మరోసారి ఆ తప్పును రిపీట్ చేయకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత కూడా తండ్రి మీదే ఉంటుంది. కానీ.. విక్రమ్ మాత్రం కొడుకు చేసిన తప్పును వెనకేసుకొచ్చి అనవసరంగా అభాసుపాలవుతున్నాడు. ఇటీవల తాగేసి కారు నడిపి ఒక ఆటోని గుద్దేయడంతోపాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయాపాడడానికి కారకుడయ్యాడు విక్రమ్ కుమారుడు ధృవ్. ఈ విషయం తమిళనాట సెన్సేషన్ అయిపోయింది. హీరోగా ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వకముందే ఇలా అనవసరంగా వార్తల్లో నిలవడం వల్ల ధృవ్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ పోయింది జనాలకి.
దాంతో ఏం చేయాలో తెలియక విక్రమ్ “నా కొడుకు “అర్జున్ రెడ్డి” రీమేక్ ఓ నటిస్తున్నాడు. ఆ పాత్రలో లీనం అవ్వడం కోసమే మద్యం అలవాటు చేసుకొన్నాడు కానీ తాగుబోతు కాదు. అలాగే.. క్యారెక్టర్ లో నాకు మల్లే ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల రూడ్ గా బిహేవ్ చేశాడు కానీ.. కావాలని చేయలేదు. దయచేసి అర్ధం చేసుకోండి” అంటూ ఓ విచిత్రమైన ఎక్స్ ప్లనేషన్ ఇచ్చాడు. దాంతో అప్పటివరకూ ఏదో సరదాకి కామెంట్ చేసిన వాళ్ళందరూ “ఇదేంటి విక్రమ్ ఇంత చెత్త రీజన్స్ చెబుతున్నాడు. సైలెంట్ గా ఉన్నా సరిపోయేది కదా” అని కామెంట్ చేయడం మొదలెట్టారు. దాంతో ఇప్పుడు తన పరువుతోపాటు తన కొడుకు కెరీర్ ను ఎలా కాపాడుకోవాలో తెలియక తికమక పడుతున్నాడు విక్రమ్.