కమల్ ని గుర్తు చేస్తున్న విక్రమ్..!

తమిళంలో సూపర్ స్టార్ డమ్ ని అందుకున్న చియాన్ విక్రమ్ ఎప్పుడూ కాన్సెప్ట్ మూవీస్ ని చేస్తూ ఉంటాడు. గత కొన్ని సినిమాలుగా నిరాశ పరుస్తున్నా కూడా ఈసారి కోబ్రా అంటూ వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ కోబ్రా మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుండగా, ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పటాను ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించబోతున్నాడు.

అంతేకాదు, పవర్ ఫుల్ యాక్షన్ కూడా ఇందులో చూపించాడు ఇర్ఫాన్ పటాన్. విక్రమ్ ని పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ తన అసహనాన్ని చక్కగా ప్రదర్సించాడు. క్రికెటర్ అయినా కూడా చాలా ప్రొఫెషనల్ యాక్టర్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్నాడు. ఇక చియాన్ విక్రమ్ విభిన్నమైన గెటప్స్ లో దశావతారం సినిమాలో కమల్ హాసన్ ని గుర్తు చేస్తున్నాడు. చిత్రవిచిత్రమైన గెటప్స్ లో అస్సలు పోల్చుకోలేకుండా మేకప్ వేసుకుని తనలోని మరో యాంగిల్ ని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు.

కోబ్రా ఆడిన ఈ గేమ్ ఏంటి..? దేనికోసం ఇదంతా చేశాడు అనేది తెలియాలంటే మనం సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఆగాల్సిందే. అజమ్ జ్ఞానముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ని అందించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాని ప్రెజంట్ చేస్తోంది. అదీ మేటర్.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus