యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి ‘విశ్వరూపం 2’ తర్వాత వచ్చిన చిత్రం ‘విక్రమ్’. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య కూడా ఈ చిత్రంలో రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేయడం జరిగింది. టాలీవుడ్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఇక జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని… 4 రోజులకే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది. రెండో వారం కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది.15వ రోజున కూడా ఈ మూవీ డీసెంట్ అనిపించడం విశేషం. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
6.25 cr
సీడెడ్
1.92 cr
ఉత్తరాంధ్ర
2.10 cr
ఈస్ట్
1.10 cr
వెస్ట్
0.74 cr
గుంటూరు
0.99 cr
కృష్ణా
1.10 cr
నెల్లూరు
0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.71 cr
‘విక్రమ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4వ రోజుకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 15 రోజులు పూర్తయ్యేసరికి రూ.14.71 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకి రూ.7.11 కోట్ల లాభాలు దక్కినట్టు అయ్యింది.
‘మేజర్’ ‘ఎఫ్3’ ‘అంటే సుందరానికీ’ వంటి చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ ‘విక్రమ్’ ఈ రేంజ్లో కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.నిన్న ‘విరాటపర్వం’ మూవీ రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది.