Dhruva Natchathiram: అంత డబ్బులు అడ్జస్ట్‌ మూడు రోజుల్లో సాధ్యమేనా? గౌతమ్‌ మీనన్‌ ఏం చేస్తారో?

ఆరేళ్ల క్రితం సినిమా… ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తోంది అంటూ ఇటీవల వరకు విక్రమ్‌ అభిమానులు చాలా ఆనందపడ్డారు. ఆ సినిమా పోస్టర్లు, టీజర్లలో విక్రమ్‌ను చూసి… హిట్‌ కళ కనిపిస్తోంది… ఏం చేస్తారో అనుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడంతో 24కు అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో సినిమా ప్రచారం ఆగిపోయింది. ఏమైందా అని ఆరా తీస్తే సినిమా విడుదల కూడా ఆగిపోయింది అని అంటున్నారు.

‘ధృవ నక్షత్రం’… ఈ సినిమా ప్రారంభించినప్పుడు చాలా పెద్ద హైప్‌ ఉండింది. విక్రమ్‌ – గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌ అనేసరికి ఏదో స్పెషాలిటీ ఉంటుంది అని ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్‌ చేశారు. అందులోనూ ఈ సినిమా రెండు పార్టులుగా వస్తుంది అని చెప్పేసరికి ఆ హైప్‌ ఇంకా పెరిగింది. కానీ రిలీజ్‌ కోసం ప్రేక్షకులు ఆరేళ్లు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. బడ్జెట్‌, సినిమా నిర్మాణం, మార్కెట్‌ తదితర కారణాల వల్ల ఆలస్యం అయింది అని చెబుతున్నారు. అయితే అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన లేదు.

అయితే, ఇటీవల ఎట్టకేలకు (Dhruva Natchathiram) ‘ధృవ నక్షత్రం – చాఫ్టర్ 1 యుద్ధకాండం’ అంటూ రిలీజ్‌ డట్‌ ప్రకటించారు. అయితే త కొద్దిరోజులుగా టీమ్ మౌనంగా ఉంది. విక్రమ్ ఈ సినిమా గురించే పట్టనట్టు ఉన్నాడు. మరోవ వైపు దర్శకుడు కమ్‌ నిర్మాత అయితే గౌతమ్‌ మీనన్‌ కూడా కామ్‌గానే ఉన్నారు. ఏంటా అని చూస్తే.. ఈ సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్‌ తిరిగి చెల్లించాల్సి ఉందట. అది సుమారు రూ. 50 కోట్లు అని అంటున్నారు.

ఆ డబ్బులు క్లియర్‌ చేస్తే కానీ సినిమా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇదంతా చూస్తుంటే ‘ధృవ నక్షత్రం’ మళ్లీ వాయిదా పడక తప్పదు అని కోడంబాక్కం టాక్. అయితే ఓటీటీ కోసం నెట్ ఫ్లిక్స్‌తో ఇప్పటికే భారీ ఒప్పందం అయింది అంటున్నారు. ఆ మొత్తం అందాలంటే సినిమా రిలీజ్‌ అవ్వాలి. కానీ డబ్బులు క్లియర్‌ చేయందే థియేటర్‌ రిలీజ్‌ అవ్వదు. ఈ సంకట స్థితిలో గౌతమ్‌ మేనన్‌ – విక్రమ్‌ ముందుకు రాక తప్పదు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus