Vikrant Rona Collections: ఆదివారం రోజున కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విక్రాంత్ రోణ..!

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రాంత్ రోణ’.అనూప్ భండారి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ వంటి వారు కీల‌క పాత్ర‌లు పోషించారు. ‘స‌ల్మాన్ ఖాన్ ఫిలింస్’ స‌మ‌ర్ప‌ణ‌లో ‘జీ స్టూడియోస్‌’, ‘కిచ్చా క్రియేష‌న్స్’ ‘షాలిని ఆర్ట్స్’ ‘ఇన్‌వెనియో ఆరిజ‌న్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది.

దీంతో కలెక్షన్లు బాగానే నమోదయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.3,4 రోజుల్లో కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.10 cr
సీడెడ్ 0.32 cr
ఉత్తరాంధ్ర 0.35 cr
ఈస్ట్ 0.21 cr
వెస్ట్ 0.16 cr
గుంటూరు 0.25 cr
కృష్ణా 0.21 cr
నెల్లూరు 0.11 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్) 0.09 cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.80 cr

‘విక్రాంత్ రోణ’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.1.14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.1.2 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రూ.2.8 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డు సృష్టించింది.

రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన ఈ చిత్రం.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి తెలుగు బయ్యర్స్ కు 1.6 కోట్ల వరకు లాభాలను అందించింది.సుధీప్ హీరోగా నటించిన సినిమాల్లో తెలుగులో హిట్ అయిన మూవీ ఇదే మొదటిది కావడం విశేషం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus