బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాను అలా ప్లాన్ చేశారా?

బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల నటిస్తుండగా బాలయ్యకు జోడీగా కాజల్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నోరా ఫతేహి కనిపించనున్నారు. నోరా ఫతేహి రోల్ పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య నోరా ఫతేహి మధ్య ఫైట్ సీన్ ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైరల్ అవుతున్న కామెంట్లు ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. సాహో గారపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా సినిమాకు సంబంధించి అధికారికంగా అప్ డేట్స్ రావాల్సి ఉంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి వేగంగా అప్ డేట్స్ వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఏడాది దసరా పండుగకు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ భారీ స్థాయిలోనే ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. బాలయ్య భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు తన ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తున్నారు.

బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య వరుస షూటింగ్ లతో బిజీ అవుతూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండటం గమనార్హం. బాలయ్య సినిమాల బడ్జెట్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. బాలయ్య ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఎక్కువగా ఓటేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus