Mahesh Babu, Rajamouli: ఆ హీరోను విలన్ గా ఫిక్స్ చేసిన జక్కన్న!

మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ, కథనానికి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని 2024 సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే రాజమౌళి ఈ సినిమాలో విలన్ ను కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ప్రముఖ టాలీవుడ్ నటుడు గోపీచంద్ ను ఈ సినిమాలో విలన్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో నటించడానికి గోపీచంద్ ఓకే చెప్పారో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో గోపీచంద్ బిజీగా ఉన్నారు. గతేడాది సీటీమార్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ ఈ ఏడాది పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రాశీఖన్నా హీరోయిన్ గా మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

చాలా సంవత్సరాల క్రితం మహేష్ హీరోగా గోపీచంద్ విలన్ గా నిజం అనే సినిమా తెరకెక్కింది. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. మహేష్ రాజమౌళి సినిమాలో గోపీచంద్ విలన్ గా నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి సినిమాలో నటిస్తే గోపీచంద్ కు నటుడిగా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. వైరల్ అవుతున్న ఈ వార్త గురించి గోపీచంద్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండటం గమనార్హం. దాదాపుగా 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. రాజమౌళి మహేష్ బాబును ఇప్పటివరకు ఎవరూ చూపించని పాత్రలో చూపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus