Prabhas: ప్రభాస్ కు విలన్ గా మలయాళ స్టార్!

పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ క్రేజ్, పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా ప్రస్తుతం నాలుగు సినిమాల షూటింగ్ జరుగుతుండగా ఈ నాలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు విలన్ గా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

ఈ సినిమాలో పృథ్వీరాజ్ కూడా నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ కేజీఎఫ్ సినిమాను మలయాళంలో సొంతంగా రిలీజ్ చేశారు. సలార్ మూవీ మలయాళంలో కూడా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ద్వారా మలయాళంలో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

పృథ్వీరాజ్ విలనిజం సలార్ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో పృథ్వీరాజ్ గతంలో పోలీస్ పోలీస్ అనే సినిమాలో విలన్ గా నటించారు. పృథ్వీరాజ్ సలార్ లో నటిస్తుండటంతో సలార్ పై అంచనాలు మరింత ఎక్కువగా పెరిగాయి. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో సలార్ మూవీ రిలీజ్ కానుంది. శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus