DJ Tillu: సీక్వెల్స్ మీద ఇంట్రెస్ట్ లేదు.. ‘డీజేటిల్లు’ డైరెక్టర్ కామెంట్స్!

ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో హీరో సిద్ధు జొన్నలగడ్డకి యూత్ లో క్రేజ్ పెరిగిపోయింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేశారు. సినిమాలో డైలాగ్స్, సీన్స్ మీద లక్షల కొద్దీ మీమ్స్ వచ్చాయి. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని రిలీజ్ టైంలోనే చెప్పారు.

చెప్పినట్లుగాగే ‘డీజేటిల్లు’కి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. అయితే దర్శకుడు మాత్రం మారిపోయాడు. ‘డీజేటిల్లు’ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. సీక్వెల్ కి కూడా ఆయనే డైరెక్టర్ అనుకున్నారు. కానీ సడెన్ గా ఆయన ప్లేస్ లో మల్లిక్ రామ్ అనే డైరెక్టర్ వచ్చి చేరారు. ఒక హిట్టు సినిమా సీక్వెల్ నుంచి డైరెక్టర్ ఎందుకు తప్పుకున్నారనే విషయంపై రకరకాలుగా ప్రచారం జరిగింది.

సిద్ధు జొన్నలగడ్డతో గొడవ కారణంగానే విమల్ కృష్ణ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై విమల్ కృష్ణ క్లారిటీ ఇచ్చారు. అసలు సీక్వెల్ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరించారు. ‘డీజేటిల్లు’ సినిమాకి సీక్వెల్ చేద్దామని తనను అడిగారని.. అయితే సీక్వెల్స్ మీద తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు విమల్ కృష్ణ. దానికి కారణం ఒకటే క్యారెక్టర్ మీద మళ్లీ వర్క్ చేయాలని.. అది తనకు నచ్చదని అన్నారు.

మళ్లీ సిద్ధుతో సినిమా అంటే అది కొత్తగా ఉండాలని.. తమ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎవరూ ఊహించనట్లుగా ఉండాలని.. ఊహించేలా ఉండకూడదని అన్నారు. అలానే ఇతర హీరోలు, నిర్మాణ సంస్థలతో కమిట్మెంట్ ఉండడం వలన సిద్ధూతో వెంటనే సినిమా చేయడానికి కుదరలేదని చెప్పుకొచ్చారు. ఇక ‘టిల్లు స్క్వేర్’ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధు సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus