Vimanam Twitter Review: విమానం ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే ?

అంగ వైకల్యం ఉన్న తండ్రి తన కొడుకుని విమానం ఎక్కించడానికి పడే కష్టాలను ‘విమానం’ టీజర్, ట్రైలర్లలో చూపించారు. ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి పేరు వచ్చింది. సముద్ర ఖని తండ్రి పాత్రలో, మాస్టర్ ధ్రువన్ కొడుకు పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ ప్ర‌సాద్ యానాల దర్శకుడు. జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌,డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ వంటి వారు కీలక పాత్రలు పోషించారు.

జూన్ 9 న అంటే ఈరోజు ఈ చిత్రం (Vimanam) విడుదల కాబోతోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. కథ మొత్తం టీజర్, ట్రైలర్ లలో చూపించినట్టే ఉందట. కానీ కొడుకుని విమానం ఎక్కించాలని ఓ తండ్రి ఎందుకు అంతలా తపన పడుతున్నాడు.. పూట కూడా గడవని సంపాదనతో అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అనేది సినిమాలో చూపించాడట.

సముద్ర ఖని నటన అద్భుతంగా ఉందని.. ఫస్ట్ హాఫ్ బాగుందని అంటున్నారు. కాని సెకండ్ హాఫ్ చాలా సాగదీసినట్టు ఉందని, ట్రాజెడీ చాలా ఎక్కువగా ఉందని.. ఇలాంటి ఏడిపించే కంటెంట్ థియేటర్ కి సరిపోదు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో అనసూయ – రాహుల్ రామకృష్ణ ల ట్రాక్ విసిగించే విధంగా ఉందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus