Vimanam: ఓటీటీలో దూసుకుపోతున్న విమానం.. ఏకంగా 50 మిలియన వ్యూవింగ్ మినిట్స్ తో?

ప్రస్తుత కాలంలో చిన్న సినిమాలు కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. తాజాగా శివ ప్రసాద్ యానాల అనే దర్శకుడి దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కుర్రపాటి క్రియేషన్ వర్క్స్ ఎంతో సంయుక్తంగా నిర్మించిన చిత్రం విమానం. ఈ సినిమా గత కొద్ది రోజుల క్రితం థియేటర్లలో విడుదలై థియేటర్లో కాస్త మిశ్రమ స్పందన లభించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా జీ 5 లో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

అనసూయ సముద్రఖని వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఎంతోమంది హృదయాలను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఇలాంటి హార్ట్ టచ్చింగ్ సినిమాలు ఏవి కూడా రాలేదని చెప్పాలి. ఇలా అందరి హృదయాలను బరువెక్కిస్తున్నటువంటి విమానం సినిమా ఓటీటీలో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. (Vimanam) ఈ సినిమా జూన్ 22వ తేదీ జీ 5 లో అందుబాటులోకి వచ్చింది.

తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ప్రేమానురాగాలకు ప్రతీకగా తెరికెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది. డిజిటల్ మీడియాలో అందరిని ఆకట్టుకొని ఏకంగా 50 మిలియన్స్ వ్యూవింగ్ మినిట్స్ తో దూసుకుపోతుంది. ఇందులో సముద్రఖని, మాస్టర్ ధ్రువ నటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుందని చెప్పాలి. ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..ఈ సినిమాలో వీరయ్య అనే పాత్రలో సముద్రఖని నటిస్తారు ఆయనకు ఒక కాలు ఉండదు భార్య కూడా చనిపోయి ఉంటుంది.

అయితే తన కుమారుడు ఎప్పటినుంచో విమానంలో ఎక్కి ప్రయాణం చేయాలని కోరుకుంటారు. మరి ఆ కుర్రాడు విమానం ఎక్కడానికి ఎలా కష్టపడ్డారనేది ఈ విమానం కథ.ఇలా ఓ అద్భుతమైన సినిమాని ఓటీటీలో ప్రేక్షకులు ఎంతో ఆదరించారని చెప్పాలి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus