‘మగధీర’ రేంజ్ లో ‘వినయ విధేయ రామా’..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామా’. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఇటీవల విడుదలన టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఫైట్స్ ను ఒక రేంజ్ లో తెరకెక్కించాడంట బోయపాటి. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలువనుందట.

దాదాపు 100మంది ఫైట‌ర్స్, 500 మందికి పైగానే జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ల‌తో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారట.’మగధీర’ చిత్రంలో 100 మంది ఫైట్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో అదే విధంగా ‘వినయ విధేయ రామా’ ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా అద్భుతంగా ఉంటుంద‌ని భారీగా చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ప్ర‌శాంత్, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండడం విశేషం. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న ఈ చిత్రాన్ని డీ.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డీ.వి.వి దానయ్య నిర్మిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus