మెగా హీరో కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న వినాయక్!
- April 15, 2017 / 06:38 AM ISTByFilmy Focus
మాస్ పల్స్ తెల్సిన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు. యువ హీరోలకు సైతం భారీ ఓపెనింగ్స్ రప్పించాలంటే అతనికే సాధ్యం. ఆది తో ఎన్టీఆర్ కి, బన్నీ తో అల్లు అర్జున్ కెరీర్ ని మలుపుతున్న వినాయక్ ప్రస్తుతం మరో హీరో రేంజ్ పెంచే పనిలో ఉన్నారు. రీసెంట్ గా ‘ఖైదీ నంబర్ 150’ తెరకెక్కించి మెగాస్టార్ చిరంజీవిని రీ లాంచ్ చేసిన ఈ డైరక్టర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ తో సినిమా తీస్తారని వార్తలు షికారు చేశాయి.
కానీ వారిద్దరూ ప్రాజెక్ట్ లకు లాక్ అయిపోయి ఉండడంతో మళ్ళీ మెగా హీరోతోనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలిసింది. ఆ అదృష్టవంతుడు ఎవరో కాదు యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. అతన్ని మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీవీఎస్ రవి డైరెక్షన్‌లో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్న సాయిధరమ్.. వినాయక్ దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారు. అధికారికంగా ఈ ప్రాజక్ట్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















