Ajith: అజిత్‌ ప్రేమ… వరుసగా మూడో అవకాశం

అజిత్‌ అభిమానం గురించి చెప్పడానికి, అజిత్‌ తన వాళ్ల మీద పెట్టుకునే నమ్మకం గురించి చెప్పడానికి ఒక్క పేరు చెబితే చాలు. అదే దర్శకుడు ‘శివ’. అజిత్‌ ఒక దర్శకుడి మీద నమ్మకం పెట్టుకుంటే అతనికి ఎన్ని అవకాశాలిస్తారు, ఎంతవరకు తీసుకెళ్తారు అనేది శివను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే శివకి అజిత్‌ వరుసగా నాలుగు సినిమాలు చేశాడు. అందుకు తగ్గట్టే శివ కూడా నాలుగు హిట్‌ సినిమాలు ఇచ్చాడు. దీంతో ఆ ఇద్దరి కాంబోను వివరించడానికి ఎవరికీ మాటలు చాలవు. ఇప్పుడు అలాంటి కాంబో మరొకటి తమిళనాట సెట్‌ అవుతోంది.

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్‌కు ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికీ లేదు అని చాలాసార్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ పాయింట్ ఆధారంగా ఓ కాంబినేషన్‌లో మూడో సినిమా ఓకే అయ్యిందంటున్నారు. ‘నేర్కొండ పార్వై’హెచ్‌. వినోత్‌ అనే కొత్త కుర్రాడిని అజిత్‌ పరిచయం చేశాడు. ఆ సినిమాలో అతని పనితనం నచ్చి వెంటనే మరో సినిమా అవకాశం ఇచ్చాడు. అదే ‘వాలిమై’. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా సెట్స్‌పైనే ఉంది. ఈలోగా వినోత్‌కు అజిత్‌ మరో అవకాశం ఇచ్చాడనేది కొత్త టాక్‌.

‘వాలిమై’ ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌లో ఉంది. కరోనా లేకపోయుంటే ఈ పాటికి సినిమా ఎప్పుడో పూర్తై విడుదల కూడా అయిపోయేది. అయితే గతంలో వినోత్‌, అజిత్‌ మధ్య ఓ సినిమా కథ చర్చలోకి వచ్చిందట. ఇప్పుడు దానినే ఓకే చేసి… వినోత్‌కు మూడో ఛాన్స్‌ ఇచ్చేశాడట అజిత్‌. ఈ సినిమా కూడా బోనీ కపూరే నిర్మిస్తున్నారు. ఇది కూడా పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లరే అని తెలుస్తోంది. జూలై నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus