Viral Star: సీరియల్స్‌లోకి సోషల్‌ మీడియా స్టార్‌.. ఆ కష్టాలు తీరుతాయా?

కొన్నేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా, రీల్స్‌ స్వైప్‌ చేసినా వినిపించిన పాట ‘కచ్చా బాదం’. ఓ చిరు వ్యాపారి తన వ్యాపారం కోసం రాసి, ఆలపించిన ‘కచ్చా బాదం’ పాట ఎంత వైరల్‌ అయ్యిందో మీకూ తెలిసే ఉంటుంది. రీమిక్స్‌ చేసి మరీ చాలామంది ఆ పాటకు స్టెప్పులేశారు. స్టార్‌లు, స్టార్‌ల పిల్లలు కూడా ఈ పాటకు స్టెప్పులేసిన వారిలో ఉన్నారు. ఆ పాటను సోషల్‌ మీడియా తెచ్చిన వ్యక్తి పేరు భువన్‌ బద్యాకర్‌. పాటతో సెలబ్రిటీగా మారిన ఆయన ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

భువన్‌ బద్యాకర్‌ను (Viral Star) ఓ బెంగాలీ సీరియల్‌లో నటుడిగా తీసుకున్నారట. ఓ అమ్మాయికి తండ్రిగా ఆ సీరియల్‌లో కనిపించనున్నారట కచ్చా బాదం స్టార్‌. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి నిర్ణయాన్ని తిరస్కరించే తండ్రి పాత్రలో ఆయన టీవీ ప్రేక్షకులను పలకరించబోతున్నారట. ఇప్పటికే ఆయన పార్ట్‌ షూటింగ్‌ పూర్తయింది అని సమాచారం. రెండు రోజులపాటు చిత్రీకరణలో పాల్గొన్న ఆయనకు రూ.40 వేల పారితోషికం ఇచ్చారు అని సమాచారం. భవిష్యత్తులో అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తానని భువన్‌ చెప్పాడట. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్..

తన చిరు వ్యాపారం అభివృద్ధి చేయడానికి కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో ‘కచ్చా బాదం’ పాట సిద్ధం చేసుకున్నాడు. ఆ పాట పాడుకుంటూ బాదం అమ్ముతుండగా ఓ వ్యక్తి దాని రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. పాట బీట్‌, లిరిక్‌ డిఫరెంట్‌గా ఉండటంతో వైరల్‌ అయ్యింది. దాంతో భువన్‌ స్టార్‌ అయ్యాడు. ఆ తర్వాత అదే పాట రీమిక్స్‌లో నటించి డబ్బులు కూడా సంపాదించాడు. టీవీ కార్యక్రమాలు, మ్యూజిక్‌ వీడియోల్లో మెరిశాక వచ్చిన డబ్బును అప్పులు, విరాళాల పేరుతో గ్రామస్థులు ఆయన్ను నుండి కాజేశారట.

అంతేకాదు కొందరు యువకుల వేధింపులు భరించలేక సొంతూరును ఖాళీ చేసి మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో ఉంటున్నారు. నన్ను పాపులర్‌ చేసిన ‘కచ్చా బాదం’ పాట వల్లే నా సొంతింటికి దూరమయ్యా అని భువన్‌ కొన్ని రోజుల క్రితం బాధపడ్డాడు. ఓ కంపెనీ డబ్బు ఆశ చూపి, కాపీరైట్‌ పత్రాలపై సంతకం తీసుకోవడంతో తాను ‘కచ్చా బాదం’ పాటని పాడటానికి కూడా లేకపోయింది అని చెప్పాడు. ఆఖరికి తన పాటను తాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే అవకాశం కూడా లేకపోయిందని భువన్‌ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీరియల్‌లోకి వచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus