దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య ప్రతి రోజు 4వేలు దాటుతోంది. ఎక్కడ చూసినా కూడా ఆక్సిజన్ వెంటిలేటర్ కావాలి అంటూ ఆర్థనాధాలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వాలు దాదాపు పూర్తిగా విఫలం అవుతున్నాయి. ఇక దేశం ఆర్థికంగా కూడా దెబ్బ తింటున్న తరుణంలో కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం స్టార్ సెలబ్రెటీలు వారికి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
సినిమా తారలు, వ్యాపారులు, క్రీడాకారులు కూడా డోనేషన్స్ అందిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క కూడా వారికి సంబంధించిన విరాలన్ని ప్రకటించారు. ఇద్దరు కలిసి కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ కఠిన సమయాల్లో పరిస్థితి అనుకూలంగా ఉన్నవారు తోటి వారికి వీలైనంత వరకు సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరారు. ఇటీవల ఐపీఎల్ క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.
మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చిన విరాట్ టీమ్ RCB ఎలాగైనా సీజన్ విన్నర్ గా నిలవాలని అనుకుంది. కానీ సడన్ గా కోవిడ్ ప్లేయర్స్ ను తాకడంతో పూర్తిగా నిలిపివేశారు. ఇక విదేశీ ప్లేయర్స్ కూడా స్పెషల్ చార్టెట్ ఫ్లైట్స్ లలో సొంత ఇంటికి చేరుకున్నారు.
Most Recommended Video
As our country battles the second wave of Covid-19, and our healthcare systems are facing extreme challenges, it breaks my heart to see our people suffering.